- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెంగ్యూ డేంజర్ బెల్స్.. మంచం పట్టిన KCR కాలనీ, చంద్రబాబు కాలనీ
దిశ, గోదావరిఖని : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగీ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు మంచాన పడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్స పొందుతున్నారు. చాలా మంది ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు సైతం జ్వరాల బారినపడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇండ్లలో, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం పడకేసి ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరు వర్షాలతో దోమలు, ఈగలు ప్రబలుతున్నాయి. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని పలువురు వాపోతున్నారు.
ఎలా వస్తుందంటే..
ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు స్థానికంగా పడేసిన ఇతరత్రా చెత్తాచెదారంతోపాటు కూలర్లు, టైర్లలో నిల్వ ఉండే నీటితో టైగర్(ఏడీస్) దోమ వృద్ధి చెందుతుంది. దీంతో దోమ కుట్టిన వారికి డెంగ్యూ వస్తుంది.
డెంగీ లక్షణాలు ఇవి..
మొదట జ్వరం వస్తుంది. ఐదు రోజుల వరకు తగ్గని పక్షంలో పరీక్ష చేయించుకోవాలి. లేకపోతే డెంగ్యూ ముదిరి ముక్కు నుంచి రక్తం కారి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కడుతుంది. మహిళలకు అయితే రక్తస్రావమవుతుంది. ఈ దశను ఎమర్జెన్సీ ఫీవర్ అంటారు. సాధారణంగా జ్వరంతో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది.
ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు..
25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి రాజు సుమలత.
మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానిక కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25వ డివిజన్ కేసీఆర్ కాలనీ, చంద్రబాబు కాలనీ, సాయి నగర్ కాలనీతో పాటు పలు కాలనీల్లో ప్రస్తుతం వాతావరణంలో మార్పు దృష్ట్యా విషజ్వరాలు తీవ్రస్థాయిలో ఉంది. దీంతో, డెంగ్యూ, టైఫాయిడ్ మొదలైన విషజ్వరాలతో తీవ్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అయినప్పటికీ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోకుండా దోమకాటు నివారణకు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు కోరారు. జ్వరాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.