- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనక రాజుకు పెన్షన్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనుకరాజుకు తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీ సంస్కృతి ఆదిమ గోండి గుస్సాడీ కళను కనక రాజు 70 సంవత్సరాల నుండి ఆచరిస్తూ, కాపాడుతూ, భావితరానికి అందిస్తున్నారు. గోండి గుస్సాడీ కళపై దేశంలో ఆదిమ కళ ప్రదర్శనలు చేస్తునందుకు, ఆదివాసీ సంస్కృతిని బయట ప్రపంచానికి తెలియజేస్తునందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయం ఈరోజు కనక రాజుకు సన్మానం చేసి పెన్షన్ ఉత్తర్వులు అందించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించి అంతరించిపోయిన కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ ఇస్తోందన్నారు. స్వరాష్ట్రమైన తెలంగాణ సాధనలో కళాకారుల పాత్ర విలువ కట్టలేనిదని, తెలంగాణ రాష్ట్రసాధనలో కళాకారుల పాత్ర సముచిత స్థానం ఉందన్నారు. ప్రతి కళాకారుడిని కాపాడుతామని, అంతరించిపోయిన కళలను పునర్జీవంపోయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన వారు తెలంగాణ రాష్ట్ర బాష సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగరావు, కనక వెంకటేశ్వరరావు, మరసుకొల జ్ఞానేశ్వర్, పెందుర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.