- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్నులపై అంతొద్దూ.. కేంద్రానికి లేఖ రాసిన తయారీదారులు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం అన్ని రకాల పెన్నులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 18 శాతం విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో పెన్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తర్వాత అమ్మకాలు భారీగా తగ్గాయని, దీనిపై పునరాలోచించాలని తయారీదారులు కోరుతున్నారు. గతంలో ఫౌంటెన్, స్టైలోగ్రాఫ్ పెన్నులపై మాత్రమే 18 శాతం జీఎస్టీ రేటు ఉండేది. బాల్ పాయింట్ పెన్నులపై 12 శాతంగా ఉండేది. పెన్నుల పరిశ్రమలో తక్కువ ధర కలిగిన వాటి అమ్మకాలే అత్యధికంగా ఉంటాయని, ఇప్పుడు అన్ని రకాల పెన్నులపై ఒకే జీఎస్టీ రేటు విధించడం వల్ల అమ్మకాలపై ప్రభావం అధికంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
‘ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా పెన్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. పాఠశాలలతో పాటు ఆఫీసులు కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో అమ్మకాలు జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వల్ల మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటామని’ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మానుఫాక్చరర్ ఆర్గనైజేషన్ ఇండియా అధ్యక్షుడు రాజేష్ రాథోడ్ అన్నారు. ఇప్పటికే తమిళనాడు పెన్ తయారీదారులతో పాటు, విదర్భ పెన్, స్టేషనర్స్ అసోసియేషన్లు జీఎస్టీ రేటు తగ్గించాలని మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాయి. కాగా, అక్టోబర్ నుంచి అన్ని పెన్నులపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో బాల్‌పాయింట్, ఫిల్-టిప్, ఇతర టిప్‌పెన్‌లు, మార్కర్, పెన్ హోల్డర్, పెన్సిల్ హోల్డర్, క్యాప్‌లు, క్లిప్‌లతో పాటు అన్నిటిపై 18 శాతం కేటగిరిలోకి వస్తాయి.