- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే తమ్ముడిని.. నా కారు ఆపుతారా.. మేము ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు..!
దిశ, పెద్దపల్లి : ఏయ్ నేనెవరో తెలుసా.. నా కారే ఆపుతారా.. మేము ఇచ్చే డబ్బులతో మీరు బతుకుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు ఓ ఎమ్మెల్యే సోదరుడు. నేను రైతును నాకేం ధాన్యం అమ్ముకునేందుకు వెళ్లాలని ఓ సారి, పెళ్లికి వెల్తున్నానంటూ మరోసారి పోలీసులకు తలా తోక లేని సమాధానాలు చెప్పి ముప్పుతిప్పలు పెట్టాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తమ్ముడు దాసరి అంజా రెడ్డి.
నేను పెద్దపెల్లి ఎమ్మెల్యే తమ్ముడిని, ఓ రైతును నా కారే ఆపుతారా.. ఎంత ధైర్యం.. రైతు పెళ్లికి వెళ్ళ కూడదా.. రైతుకు పాస్ అవసరమా.. మేము ఇచ్చే డబ్బులతో డ్యూటీ చేస్తున్న మీకు మేము అంటే లెక్క లేదా..? అంటూ డ్యూటీలో ఉన్న ఏఎస్సై నాగయ్యపై విరుచుకు పడ్డాడు. ఘటన స్థలికి చేరుకున్న ఎస్సై ఉపేంద్ర రావు వారించి అంజారెడ్డి కారు నెంబర్ నోట్ చేసుకొని పంపించారు.
దాదాపు గంట సేపు దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద దుమ్ములేపే డైలాగులతో హల్ చల్ చేశాడు అంజారెడ్డి. కావాలంటే ఫైన్ వేయండి కట్టుకుంటా, కానీ ఇక్కడ ఆగే ఓపిక నాకు అస్సలు లేదంటూ పోలీసులపై విరుచకపడ్డారు. ఈ పాస్ కచ్చితంగా చూపించాలని పోలీసులు అంజారెడ్డిని అడగడంతో రైతులకు ఆన్ లైన్‌లో పాస్ తీసుకోవడం ఎలా సాధ్యం.. మీరు ఏం చేస్తారో చేసుకోండంటూ గంటసేపు రభస చేశాడు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడే పోలీసులకు ముచ్చెమటలు పట్టించడం చర్చనీయాంశంగా మారింది.