- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే వైఖరితో ఇజ్జత్ పోతోంది : మాజీ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే షాకిచ్చారు. ఎమ్మెల్యే ఎదుటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఝలక్ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు ఆందోళనలో పడ్డాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు సోమవారం జరిగాయి.
నాలుగు కో ఆప్షన్ స్థానాల్లో టీఆర్ఎస్ కౌన్సెలర్ల మద్దతుతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమాన ఓట్లు గెల్చుకున్నారు. దీంతో టాస్ వేయగా ఒకటి కాంగ్రెస్ అభ్యర్థిని వరించగా మరోటి టీఆర్ఎస్ అభ్యర్థిని వరించింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు బిరుద సమత, గాజుల లక్ష్మీలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గొట్టం మల్లయ్య, మోబీన్‌లకు అనుకూలంగా చేతులెత్తారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. టాస్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గొట్టం మల్లయ్య, టీఆర్ఎస్‌కు చెందిన సయ్యద్ సాజిద్‌లు గెలిచారు.
అయితే సమత మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కోడలు కావడం గమనార్హం. అనంతరం మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మాట్లాడుతూ… సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. రూ.10 వేల కోట్లు సంపాదించుకున్నా అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ మండిపడ్డారు. కరోనా సమయంలో పేదల కోసం వసూలు చేసిన డబ్బు పూర్తిగా పంచకుండా దిగమింగాడని ఆరోపించారు. కరీంనగర్, పెద్దపల్లిలో భూములను కబ్జా చేశాడని, మనోహర్ రెడ్డి వైఖరి వల్ల పార్టీ ఇజ్జత్ పోతోందని బిరుదు రాజమల్లు వ్యాఖ్యానించారు.