పాత నేరస్థుడిపై పీడీ యాక్ట్

by Sumithra |
పాత నేరస్థుడిపై పీడీ యాక్ట్
X

దిశ, హైదరాబాద్ :
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైన పాత నేరస్థుడిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీ యాక్ట్ నమోదు చేసి, చంచల్ గూడ జైలుకు తరలించారు. మల్లేపల్లి అఫ్జల్ సాగర్ నివాసానికి చెందిన కేఎస్ ధరమ్(40) ఫాల్స్ సీలింగ్ టూల్స్ మేకర్‌గా పనిచేస్తాడు. నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల నుంచి బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించడంలో సిద్ధహస్తుడు. ఇప్పటి వరకూ 25 నేరాల్లో నిందితునిగా ఉన్నాడు. సాధారణ ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళనలు సృష్టించడం, సమాజంలో శాంతి, ప్రశాంతత లేకుండా చేయడం అతనికి పరిపాటి. కాంచన్‌బాగ్ పోలీసులు ఓ కేసులో జ్యుడీషియల్ కస్టడీ రిమాండ్‌కు తరలించగా బెయిల్ పై విడుదల అయ్యాడు. దీంతో ఫిబ్రవరి 24న సిటీ కమిషనర్ అంజనీకుమార్ కేఎస్ ధరమ్ పై ప్రివెంటివ్ డిన్షెన్ యాక్ట్ 1986 చట్టం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంచన్‌బాగ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed