దళితుల భూములను లాక్కుంటున్నారు

by Shyam |
దళితుల భూములను లాక్కుంటున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వారిని బెదిరించి భూములు లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులను సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని గుర్తు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ పోరాట వేదిక కార్యక్రమానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత ఎస్సీ కుటుంబాలతో మాట్లాడిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. దళితుల పక్షాన నిలబడి, పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వారకి న్యాయం, ఆర్థిక సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని తెలిపారు.

Advertisement

Next Story