- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేటీఎంకు మైక్రోసాఫ్ట్ నిధులందేనా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో అనేక మార్పులను చూడగలుగుతున్నాం. తాజాగా, డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎమ్ ఇటీవల అమెరికా దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో నిధుల కోసం చర్చలు జరుపుతోంది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మరింత వేగంగా వ్యాపారంలో దూసుకెళ్లాలనే ఆలోచనతో పేటీఎం సంస్థ మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి 100 మిలియన్ డాలర్లను సమీకరించాలనేది పేటీఎమ్ అంచనా. ఇది మన కరెన్సీలో సుమారు రూ. 760 కోట్లు. గతేడాది పేటీఎమ్ సంస్థ రూ. 7,600 కోట్లను సమీకరైంచాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్టు ప్రకటించింది. ఈ లక్ష్యం ఉద్దేశ్యంతోనే మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించినట్టు సమాచారం.
2019 నవంబర్‌లో అమెరికాకు చెందిన అసెట్ మేనేజర్ టీ రోవ్ పేటీఎమ్‌లో కొత్త పెట్టుబడిదారుగా వచ్చారు. ఆయన దాదాపు రూ. 1140 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. దీని తర్వాత పేటీఎమ్ సంస్థ విలువ 16 బిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఓ సారి మైక్రోసాఫ్ట్ సంస్థను నిధుల కోసం పేటీమ్ సంప్రదించినప్పటికీ ఫలితం రాలేదనీ, ఈసారి సత్ఫలితాలొచ్చే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమాచారం గురించి రెండు సంస్థలు అధికారికంగా స్పందించలేదు. పేటీఎమ్ ఫౌండర్ విజయ్ శేఖర్ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిధులు సమకూరితే పేటీఎమ్‌కు కంప్యూటింగ్, కనెక్టివిటీ, స్టోరేజ్ సొల్యూషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వంటి సంస్థలతో గట్టి పోటీ ఉన్నందున నిధుల సంపాదించడంలో ముందుండాలని సంస్థ భావిస్తోంది.
Tags : Microsoft, Vijay Shekhar Sharma, paytm