కరోనా టెస్ట్‌కు కన్నీళ్లు పెట్టిన ‘పాయల్’

by Anukaran |   ( Updated:2023-08-18 16:07:46.0  )
కరోనా టెస్ట్‌కు కన్నీళ్లు పెట్టిన ‘పాయల్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
పంజాబీ బేబీ పాయల్ రాజ్‌పుత్.. తొలి సినిమాతోనే యువ హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ తర్వాత వెంకటేశ్ సరసన ‘వెంకీ మామ’, రవితేజ పక్కన ‘డిస్కో రాజా’లో నటించి మెప్పించిన ఈ భామ.. ‘ఏ రైటర్’ షార్ట్ ఫిల్మ్‌తో తనలోని నటిని సంతృప్తి పరుచుకుంది. ఈ హాట్ బ్యూటీ.. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాయల్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా.. దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

కరోనా నిర్ధారణకు స్వాబ్ టెస్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పాయల్ శాంపిల్ సేకరిస్తున్న సమయంలో చిన్నపిల్లలా భయపడటమే కాదు.. ఏడ్చేసింది కూడా. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ‘ఓచ్.. అన్ని జాగ్రత్తలతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాం. కరోనా టెస్ట్ సమయంలో ముక్కులో స్వాబ్ రొటేషన్ చేస్తుంటారు. అది చాలా భయంకరంగా, అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ అదృష్టవశాత్తు నాకు కరోనా నెగెటివ్ వచ్చింది’ అని ఆమె తెలిపింది. ఇక పాయల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉండగా, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

Advertisement

Next Story
null