ఐటెం సాంగ్స్‌పై పాయల్ స్పందన..

by Shyam |
ఐటెం సాంగ్స్‌పై పాయల్ స్పందన..
X

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజాలతో కుర్రకారు గుండెల్ని దోచేసింది. లాక్‌డౌన్ టైమ్‌లో ‘రైటర్’గా ఓ షార్ట్‌ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. అటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ చిత్రంలోనూ, ఇటు కమల్, శంకర్ కలయికలో వస్తున్న ఇండియన్-2 మూవీలోనూ ఐటెం సాంగ్ కోసం పాయల్ ఎంపికైనట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు కానీ, తాజాగా ఈ వార్తలపై స్పందించిన పాయల్.. రూమర్లకు చెక్ పెట్టింది.

‘ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. పుష్ప, ఇండియన్-2లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నావా? అంటూ చాలామంది అడుగుతున్నారు, అలాంటిదేం లేదు. ఇప్పటివరకు నేను ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఏ షూటింగ్‌లో పాల్గొనడం లేదు. చిల్ అండ్ రిలాక్స్’ అంటూ ఇన్‌స్టా వేదికగా ఆ ఫేక్ వార్తలపై క్లారిటీనిచ్చింది పాయల్. ఐటెం సాంగ్స్ కంటే మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేసింది. కాగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ మూవీలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పాయల్ అభిమానులు మాత్రం.. తన నెక్ట్స్ ప్రాజెక్టు త్వరగా ప్రకటించాలని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story