తారక్ వాడుకోలేదా?

by Shyam |
తారక్ వాడుకోలేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రయాణం’ ఫేమ్ పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూలో కొందరు పాయల్‌కు సపోర్ట్ చేస్తే.. మరికొందరు అనురాగ్‌కు సపోర్ట్ చేశారు. అంతేకాదు ఈ వివాదంలోకి రిచా చడ్డాను లాగడంతో.. కథ కోర్టు వరకూ వెళ్లింది. కానీ ఏం జరిగినా సరే.. పాయల్ మాత్రం అనురాగ్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంది. దీనికి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పేరును తెరమీదకు తెచ్చింది.

అనురాగ్ కశ్యప్ తనపై అటాక్ చేసే సమయంలో.. తారక్ గురించి మాట్లాడారని ట్వీట్ చేసింది. తారక్ మాత్రం నిన్ను వాడుకోకుండా వదిలేశాడా? సతీసావిత్రి మాటలు మాట్లాడుతున్నావ్? అన్నాడని తెలిపింది. తనతో పనిచేసిన మహిళలు ఒక్క కాల్ దూరంలో ఉన్నారని చెప్పాడన్న పాయల్.. జూనియర్ ఎన్టీఆర్ మంచి వ్యక్తి అని ప్రపంచానికి చెప్తున్నానని వెల్లడించింది. కశ్యప్.. తారక్ గురించి మాట్లాడేందుకు కూడా కారణముందని, అదే టైమ్‌లో ‘ఊసరవెల్లి’ సినిమా చేశానని.. ఆ సినిమాను తన మేనేజర్ రిఫరెన్స్‌గా చూపించాలని అనుకున్నాడని తెలిపింది. అంతేకాదు సౌత్ స్టార్స్‌తో సినిమాలు చేయడం చాలా సేఫ్ అని కూడా చెప్పింది.

Advertisement

Next Story