మా ఎన్నికలపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంత అవసరమా !

by Anukaran |   ( Updated:2021-10-09 22:26:16.0  )
pawan-kalyan
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి ఆసక్తి రేపుతున్న మా ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు ఈ రోజు జరుగుతున్నది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. ఈ ఓటింగ్ ప్రక్రియను నగరంలోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని మూడు తరగతి గదుల్లో నిర్వహిస్తున్నారు. మా అసోషియేషన్‌ ప్యానెల్‌ సభ్యులంతా ఉత్సాహంగా ఓటింగ్‌‌లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో ఓటు వేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలకు ఇంత హడావిడి అవసరమా, సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. మా ఎన్నికల కారణంగా సినీ పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదన్నారు. తిప్పి కొడితే 900‌ల ఓట్లు లేవని, ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి పోటీ తానేప్పుడు చూడలేదని.. ఈ ఎన్నికల కారణంగా చీలిక రాదన్నారు. అలాగే మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులేనని, మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయనే వార్తలు రావడం చాలా తప్పు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story