#PSPK28 క్రేజీ న్యూస్..లెక్చరర్‌గా పవన్?

by Jakkula Samataha |
#PSPK28 క్రేజీ న్యూస్..లెక్చరర్‌గా పవన్?
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ వచ్చే నెల 9న విడుదల కానుండగా, సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘హరిహరవీరమల్లు’ చిత్ర కొన్ని షెడ్యూల్స్‌ పూర్తి చేసిన పవన్ మిగిలిన సీన్ల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్యారలెల్‌గా మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో మాజీ ఆర్మీ ఆఫీసర్‌గా పవన్ రోల్ ఉంటుందని తెలుస్తుండగా, క్రిష్ చిత్రంలో యోధుడిగా రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఉంటుందని అర్థమవుతుంది. కాగా పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న #PSPK28 సినిమాలో పవన్ క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

పవన్ వీరాభిమాని హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్‌ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించారు. ఇప్పుడు తెరకక్కబోతున్న పవన్ 28వ చిత్రంలో సమాజానికి దిశా నిర్దేశం చేసే పవర్ ఫుల్ లెక్చరర్‌గా పవర్ స్టార్‌ను చూపిస్తారట. పవన్‌ని కొత్తగా చూపించేందుకు హరీశ్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నాడని సమాచారం. చిత్ర షూటింగ్ మూవీ యూనిట్ త్వరలో ప్రారంభించనుంది. కాగా ‘వకీల్‌ సాబ్’ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, నివేదా థామస్, అనన్య నాగళ్ల, అంజలి కీలక పాత్రల్లో నటించారు. వేణు శ్రీరాం డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాని బోనీకపూర్ సమర్పిస్తుండగా దిల్ రాజు నిర్మించారు.

Advertisement

Next Story

Most Viewed