- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతిలో పవన్ కల్యాణ్
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో నేడు పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులుగా విశాఖపట్టణం, అమరావతి, కర్నూలును ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో ఆందోళణలు ఊపందుకున్నాయి.
సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలకు చెందిన రైతులు గత 55 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ అమరావతి నుంచి రాజధానిని మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎంత స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ రైతులు పట్టిన పట్టు వీడడం లేదు. మరోవైపు ప్రభుత్వం కూడా అంతే పట్టుదల ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగించారు.
అమరావతి ప్రజల ఆవేదన నేపథ్యంలో అమరావతి రీజియన్ గ్రామల్లో జనసేనాని నేడు పర్యటించనున్నారు. పెనుమాక, మందడం, వెంకటాయపాలెం, తుళ్లూరు గ్రామాలలో రెండోసారి ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో రైతులు, మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పవన్ తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని వారు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసెంబ్లీలో పవన్ ప్రతినిధి రాపాక వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని సమస్యను పవన్ ఎలా పరిష్కరిస్తారన్న ఆసక్తి నెలకొంది.
పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ర్యాలీలు, సభ, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు మూడు సినిమాలకు కమిటయ్యారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అడుగులు ఎటువైపు అన్న మీమాంస అందర్లోనూ నెలకొంది.