బుల్లితెరపై పవన్ కళ్యాణ్.. మరోసారి అభిమానులకు పండుగే..

by Shyam |
Vakeel Saab
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను కొందరు రిలీజ్‌కు ముందే లీక్ చేసినా.. విడుదల తరువాత బాక్సాఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ అభిమానులకు కోసం కంబ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’తో వచ్చారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్ జరుగలేదని పలు విమర్శలు వచ్చినా.. లాక్‌డౌన్ కు ముందే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఆ తరువాత ఓటీటీ లో కూడా భారీగానే స్పందన వచ్చింది.

ఇప్పడు బుల్లితెరపై కూడా అభిమానులను అలరించడానికి వచ్చేస్తున్నారు పవన్. ఓ ప్రముఖ టీవీ నెట్‌వర్క్ సంస్థ వకీల్‌సాబ్ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీని కోసం ఆ సంస్థ భారీగా ప్రమోషన్లు నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలో యాడ్స్, అలర్ట్స్ లాంటివి మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భారీ కటౌట్స్, పెయిటింగ్స్‌తో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. పవన్ సినిమాతో ఆ టీవీ నెట్ వర్క్ టీఆర్పీ లు తిరగరాస్తాయని పవన్ అభిమానులు అంటున్నారు.

Next Story

Most Viewed