- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. గత రెండు వారాలుగా వివిధ జిల్లాల్లోని జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమాల్లో నటిస్తున్నానంటూ ప్రకటించిన పవన్ పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై ఏపీలో ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం నింపుతూ ఆయన కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా అధికార పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా, మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఏపీలో రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణల్లా మారాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులరాజకీయాలను రూపుమాపాలంటే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. కులరాజకీయాలను రూపుమాపడం జనసేనవల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
గతంలోనే తాను రాజధానికి 33వేల ఎకరాలు అవసరమా? అని ప్రశ్నించానని గుర్తుచేశారు. కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్, రాజకీయాలు తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదని చెప్పారు. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయాయని, వాటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. పార్టీకి అండగా నిలిచింది, జనసేనను బతికించింది సామాన్యుడేనని పవన్ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తికి అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని జనసేన న్యాయవిభాగానికి సూచించారు.