- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసాయన పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాలో మరోసారి భయాందోళనలు రేకెత్తించిన గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన, నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్‌లో విషవాయువు లీక్ ఘటన మరువక ముందే సాయినార్ సంస్థలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలపై నిరంతర తనిఖీలు చేస్తుండాలని జనసేన ఎప్పటినుంచో చెబుతోందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నందున నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story