- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'స్థానిక’ సమరానికి సై : పవన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కొద్ది కాలం క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యామని తెలిపారు.
జేపీ నడ్డాతో సుమారు నాలుగు గంటలసేపు స్థానిక ఎన్నికలపై చర్చించామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన–బీజేపీ పొత్తును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు. చక్కటి ప్రణాళికతో 12వ తేదీన ఇరుపార్టీలు కలిసి స్థానిక సమరం కోసం మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. స్థానిక సమరంలో ఎలాంటి వ్యూహాలు రచించాలన్నదానిపై చర్చించినట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మంచి రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేన , బీజేపీ పార్టీలు నిలవాలని నిర్ణయించామన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో బరిలోకి దిగాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆయన ప్రకటించారు. ఈ నెల 8న విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశమవుతారని ఆయన తెలిపారు.
Tags: pawan kalyan, nadendla manohar, jp nadda, janasena, bjp, ap, local body elections