నా స్థాయి ఇంతే అన్నారు: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2020-03-14 02:42:42.0  )
నా స్థాయి ఇంతే అన్నారు: పవన్ కల్యాణ్
X

సినిమాల్లో తన స్థాయి ఇంతే అని పలు సందర్భాల్లో పలువురు వ్యాఖ్యానించారని, అయితే తన స్థాయి అది కాదని చాలా సందర్భాల్లో నిరూపితమైందని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, 2014లో పార్టీని ప్రారంభించామని అన్నారు.

పార్టీ ప్రారంభించి ఏడేళ్లవుతోందని..ఈ ఏడేళ్లలో అన్ని పనులు సంపూర్ణంగా చేశానని చెప్పారు. తాను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు 70 లక్షలతో సినిమా తీయొచ్చని అన్నారని గుర్తు చేసుకున్నారు. తనతో కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తే గొప్ప అని పేర్కొంటూ తన స్థాయిని పరిమితం చేశారని ఆయన చెప్పారు. అయితే తాను వారి అంచనాలను తలకిందులు చేశానని, వారు చెప్పిన బడ్జెట్‌కి పరిమితం కాలేదని అన్నారు.

అందుకే తాను ఒకరి స్థాయి ఇంతే అనడాన్ని నమ్మనని స్పష్టం చేశారు. ఆ రోజు తాను వాళ్ల మాటలకు ప్రభావితమై తన స్థాయి అంతేనని నిర్ధారించుకుని ఉంటే.. ఇప్పుడింతమంది అభిమానానికి పాత్రుడినయ్యేవాడిని కాదని చెప్పారు. వాళ్లను నమ్మి ఉంటే తన స్థాయి ఇప్పటికీ అలాగే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. భగవంతుడు తనకిచ్చిన శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకుని పని చేస్తానని ఆయన తెలిపారు. నటుడిగా అలాగే పని చేశానని, రాజకీయాల్లో పూర్తిగా ప్రతికూల పవనాలు ఉన్నప్పుడే రంగప్రవేశం చేశానని, ఇక్కడ కూడా అలాగే పని చేస్తానని ఆయన ప్రకటించారు.

tags : pawan kalyan, janasena, ap, rajahmundry, party anniversary

Advertisement

Next Story

Most Viewed