రజనీకాంత్‌ గారు త్వరగా కోలుకోవాలి : పవన్

by Shyam |
రజనీకాంత్‌ గారు త్వరగా కోలుకోవాలి : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. రెండ్రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. దీంతో సూపర్ స్టార్ ఆరోగ్యంపై అభిమానలలో ఆందోళన నెలకొంది. అంతేగాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా రజినీ కాంత్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘‘ప్రముఖ కథానాయకులు రజినీకాంత్ గారు అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరినట్టు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడంతో కాస్త ఆనందం అనిపించంది. మనోధైర్యం మెండుగా ఉన్న రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story

Most Viewed