‘వకీల్ సాబ్’ డైరెక్టర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

by Jakkula Samataha |
‘వకీల్ సాబ్’ డైరెక్టర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవన్
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్, కరోనా పరిస్థితులు ఇవేవీ సినిమాపై ప్రతికూలత చూపించకపోగా.. భారీ వసూళ్లతో పవన్ స్టామినా మరోసారి రుజువైంది. ‘పింక్’ రీమేక్‌గా వచ్చిన సినిమాలో పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్, స్టార్‌డమ్‌కు తగినట్లుగా చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు స్టోరీలో సోల్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. తద్వారా ఈ సినిమా సక్సెస్‌కు మెయిన్ రీజన్ అయిపోయాడు. దీంతో డైరెక్టర్‌కు పవన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story