ఆర్జీవీపై పవన్ ఫ్యాన్స్ మూవీ.. పరాన్నజీవి టైటిల్

by Anukaran |   ( Updated:2020-07-19 12:00:51.0  )
ఆర్జీవీపై పవన్ ఫ్యాన్స్ మూవీ.. పరాన్నజీవి టైటిల్
X

దిశ, వెబ్ డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా, సంచలనంగా మారుతుంది. పొలిటికల్ లీడర్లతో సహా సినీ ఇండస్ర్టీలోని హీరోలందరినీ కెలుకుతూ, ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకుంటాడు. ఇటీవలే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమాతో ఏపీ రాజకీయాల మీద సినిమా తీసాడు. కరోనా విజృంభిస్తున్న ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కరోనా, క్లైమాక్స్ వంటి సినిమాలు చిత్రీకరించాడు. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథపై కూడా సినిమా తీస్తున్నట్టు ప్రకటించి, ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం వివాదంలో ఉంది. ఇదిలా ఉండగా మరో మూవీ ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాతి కథ, అంటూ పవర్ స్టార్ మూవీ చేస్తున్నాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా రిలీజ్ చేసి, ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. అంతేగాకుండా ట్రైలర్ చూడాలంటే ప్రతిఒక్కరూ రూ.25 చెల్లించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఆగ్రహంతో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీపై సినిమా తీసేందుకు సిద్ధం అయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో తెలివైన మూర్ఖుడు అంటూ ఆయన్ని తిడుతున్నారు. ఇండియాలో వాక్ స్వాతంత్ర్యం వర్మ కంటే ఎక్కువగా ఎవరూ వాడుకోవడం లేదు.

ప్రతీ వాళ్ల జీవితంలో తొంగిచూడటం వర్మకు అలవాటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఏది ప‌డితే అది వాగేసి.. ఎంత ప‌డితే అంత రాసేయడం వర్మకు బాగా తెలిసిన విద్య అంటున్నారు. ఇప్పుడు కూడా తన చావు తెలివి తేట‌లు ఉప‌యోగిస్తూ 'ప‌వ‌ర్ స్టార్‌' సినిమా తీస్తున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ ఆయనపై మండి పడుతున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కాదు అంటూ వర్మ దొంగ కథలు చెప్తున్నాడని.. కానీ పవర్ స్టార్ అంటే ముఖ్యంగా ఎవరు గర్తుకొస్తారో తెలియదా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ప‌వ‌న్ ఇమేజ్ వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని వాళ్లు ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పవన్ పేరును కానీ.. ఇమేజ్‌ను కానీ వాడుకోకపోతే వర్మకు పూట కూడా గడవదని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్ప‌టిలా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు త‌క్కువ, డూప్‌ల‌కు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెతికి ప‌ట్టి కేవ‌లం ప‌బ్లిసిటీతో జిమ్మిక్కులు చేస్తాడని వర్మను తిడుతున్నారు. టికెట్లు అమ్ముకోవ‌డానికి కక్కుర్తి పడుతున్నాడని, ఇన్ని రోజులు వర్మ అందర్నీ కెలకడం తప్ప ఆయన్ని ఎవరూ గెలకడం లేదు కాబట్టే అలా ప్రవర్తిస్తున్నాడని, వర్మను పవన్ ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేసారు. 'ప‌రాన్న జీవి' టైటిల్‌తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఎప్పుడూ పక్కోడిపై ప‌డిపోయి బ‌తికేసే ఆర్జీవికి.. భ‌లే సూటైపోయిన పేరు క‌దా అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు.

Advertisement

Next Story