జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

by srinivas |
జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గుంటూరులో ప్రముఖ మార్కెట్‌గా పేరొందిన పీవీకే నాయుడు మార్కెట్‌ను ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించినందుకు ట్విట్టర్ మాధ్యమంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మార్కెట్‌పై ఎంతోమంది పేదలు ఆధారపడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో విలువైన ప్రజా ఆస్తులు అమ్మడం సరికాదనీ, ఆస్తులు అమ్మడం అంటే పాలనాపరంగా ప్రణాళిక లేకపోవడమేనని విమర్శించారు. గుంటూరు మార్కెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇతర ప్రజా ఆస్తుల అమ్మకం విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోవాలని ప్రభుత్వానికి జనసేనాని సూచించారు. ఉన్న ఆస్తులు అమ్మితే సంపద సృష్టి జరగదని తెలిపారు.

Advertisement

Next Story