- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టణ ప్రగతి పనుల తనిఖీ
దిశ, నల్లగొండ: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేట మున్సిపాలిటీ 33వ వార్డులో చేపడుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ ప్రగతిలో అవార్డులో రూపొందించిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చూసుకోవాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్‌పై ఉందన్నారు. వార్డ్ కమిటీ సభ్యులను పరిచయం చేసుకుని అవార్డు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 33 వార్డులు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అన్నపూర్ణమ్మ, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.