- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఏకగ్రీవం..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ఏకగ్రీవం అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, స్వతంత్ర అభ్యర్థిగా చలికా చంద్రశేఖర్‌లు నామినేషన్లు వేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులు యం.చంపాలాల్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ నామినేషన్లను పరిశీలించారు.
ఈ పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి అయిన చలికా చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రం మధ్యాహ్నం 3 గంటల తరువాత సమర్పించడం, ప్రతిపాదకులచే సంతకాలు లేకపోవడం, సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించనందున నామినేషన్‌ను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ఇద్దరి నామినేషన్లు మాత్రమే మిగిలి ఉండడంతో.. ఎన్నికల నిబంధనల ప్రకారం గురువారం తర్వాత ఎన్నిఅధికారికంగా ఎమ్మెల్సీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు మల్లారెడ్డి, సబిత స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- Tags
- Mlc elections