గాంధీ ఆస్పత్రిలో మరో రోగి మృతి

by Anukaran |   ( Updated:2020-07-15 08:54:51.0  )
గాంధీ ఆస్పత్రిలో మరో రోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పెషంట్ చనిపోవడం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్ అనే వ్యక్తి రెండ్రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీధర్ బుధవారం ఉదయం చనిపోయాడు. అయితే గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా వైద్యులు ఆక్సిజన్ పెట్టినా ఇక్కడ నిర్లక్ష్యం చేశారని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story