పేషెంట్ మృతి.. బంధువుల ఆందోళన

by Shyam |
పేషెంట్ మృతి.. బంధువుల ఆందోళన
X

స్పత్రిలో పేషెంట్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందాడని ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. రోడ్డుపైన వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆస్పత్రి ద్వారాలు మూసేసి, గేట్ల ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story