ఇంజెక్షన్ తీసుకున్న వ్యక్తి మృతి.. యశోద ఆస్పత్రి ముందు ఉద్రిక్తత

by Anukaran |
ఇంజెక్షన్ తీసుకున్న వ్యక్తి మృతి.. యశోద ఆస్పత్రి ముందు ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: కడుపునొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరితే ఇంజెక్షన్ తీసుకున్న గంటసేపటికే బాధితుడు మృతి చెందాడు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో ఈ వ్యవహారం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కడుపునొప్పితో బాధపడుతూ.. మల్లేష్ గౌడ్‌ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలోనే చికిత్స నేపథ్యంలో వైద్యులు ఇంజెక్షన్ చేశారని.. ఇంజెక్షన్ తీసుకున్న గంటలోపే మల్లేష్ గౌడ్ మృతి చెందడం ఏంటని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, మృతుడి బంధువులకు మధ్య వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు యశోద ఆస్పత్రి వద్ద భారీగా మోహరించారు. ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని చంపేశారని బాధిత కుంటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story