చర్చ్ లో శృంగారం.. 10 మంది యువతులతో కలిసి అర్ధరాత్రి పాస్టర్..

by Anukaran |   ( Updated:2021-07-15 04:42:49.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: చర్చ్.. ఓ పవిత్ర స్థలం.. ఎంతోమంది భక్తులు ప్రశాంతంగా ఉండాలని వచ్చే చోటు. కానీ, ఆ చర్చ్ లో మాత్రం జరిగేవి ప్రార్థనలు కావు..కామ క్రీడలు. చేయించేది ఎవరో కాదు ఒక పాస్టర్. పవిత్రమైన చర్చ్ లో.. పాస్టర్ అనే ముసుగు వేసుకొని వ్యభిచార గృహం నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా ఎస్టీ మంగడుకు చెందిన లాల్ షైన్ సింగ్(40) పాస్టర్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని తన లగ్జరీ బంగ్లాలో ‘ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో చర్చ్ నడుపుతున్నాడు. ఇది కన్యాకుమారిలో ఉన్న పేరున్న చర్చిలలో ఒకటిగా ఉంది. నిత్యం ప్రార్థనలు, భక్తులతో కళకళలాడుతూ ఉండేది. ఇదంతా ఒక వైపు మాత్రమే.. ఇంకోవైపు ఆ లగ్జరీ బంగ్లా ఎంతోమంది ప్రముఖులకు పడక సుఖాన్ని అందించే స్వర్గధామం.

ఒక పక్క పాస్టర్ గా నీతులు చెప్తూనే.. మరోపక్క పాడుపనులు చేయడానికి అలవాటు పడ్డాడు లాల్ షైన్ సింగ్. కేరళతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రులు చర్చ్ వద్ద అమ్మాయిలు, కార్లు రావడం, పోవడం గమనించిన స్థానికులు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. చర్చ్ లో వ్యభిచారం జరుగుతుందని పక్క సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ లు నిర్వహించారు. దీంతో వారి గుట్టు రట్టయ్యింది.

దాదాపు 15 మంది వరకు పోలీసులు చర్చ్ పేరుతో ఉన్న లగ్జరీ బంగ్లాపై దాడి చేశారు. ఆ సమయంలో బంగ్లాలోని వేర్వేరు గదుల్లో శృంగారం చేస్తున్న మహిళలు, పురుషులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువతులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఓ 19 ఏళ్ల యువతిని ఆమె తల్లే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేకెత్తిస్తోంది.

క్రికెటర్లు మాతో ‘సెక్స్’ చేసేవారు. ఐపీఎల్‌పై చీర్ లీడర్ సంచలన కామెంట్స్

తండ్రిపై పోరాటంలో బ్రిట్నీ స్పియర్స్‌కు ఊరట..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 6300 అడుగల ఎత్తు నుంచి పడిపోయిన మహిళలు..

Advertisement

Next Story