- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్ల కోసం రోడ్డెక్కారు
by Shyam |
X
దిశ, మెదక్: గత వారం రోజుల నుంచి ఆ గ్రామానికి నీటి సరఫరా బందైంది. నీటిని విడుదల చేయాలంటూ గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పస్తాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.
ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. దీంతో అధికారులు హుటాహుటిన పస్తాపూర్ చేరుకున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Advertisement
Next Story