టీచర్‌ను కేబినెట్‌లోకి తీసుకోండి..!

by Shyam |   ( Updated:2021-05-18 06:14:48.0  )
టీచర్‌ను కేబినెట్‌లోకి తీసుకోండి..!
X

దిశ, సినిమా : సెంట్రల్ కమిటీ మెంబర్ శైలజా టీచర్‌ను సీపీఐ(ఎం) కేబినెట్‌లోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. ఇది #bringourteacherback హ్యాష్ టాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండగా సెలబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. మలయాళీ యాక్ట్రెస్ పార్వతి తిరువొతు శైలజా టీచర్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ట్యాగ్ చేసిన పార్వతి.. అత్యంత సమర్థులైన లీడర్స్‌లో ఆమె ఒకరని, మెడికల్ ఎమర్జెన్సీ లాంటి డిఫికల్ట్ టైమ్స్‌లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని తెలిపింది. మత్తన్నూర్ నియోజకవర్గం నుండి 60,963 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన తను 140 మంది సభ్యుల అసెంబ్లీలో అత్యధిక మార్జిన్ కలిగి ఉందని వివరించింది. పార్టీ విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనను పార్టీ బహిష్కరించాలని ప్రయత్నాలు చేస్తోందని, ఒకవేళ అదే జరిగితే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.

Advertisement

Next Story