- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల కొండపై ఉద్యానవనాలు
దిశ, వెబ్‌డెస్క్ : టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచాలని నిర్ణయించింది. శ్రీవారికి వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా నూతన పుష్ప ఉద్యానవనాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1.5 కోట్లతో తిరుమల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు.
దాతల సహకారంతో గార్డెన్ విభాగం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సంప్రదాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మధురై మల్లెలు, కనకాంబరం, మాను సంపంగి, లిల్లీలు, తులసి, పన్నీరు ఆకు వంటి మెుక్కలను నాటారు. ఈ పుష్పాలను ఏప్రిల్, మే నెలల నుండి శ్రీవారి కైంకర్యాలకు వినియోగించనున్నారు. అలాగే గోగర్భం డ్యాం వద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. భవిష్యత్‌లో ఈ ఉద్యానవనాలను మరింత పెంచుతామని టీటీడీ స్పష్టం చేసింది.