- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదనపు ఫీజుల వసూళ్లు.. స్కూల్ వద్దకు భారీగా పేరెంట్స్
దిశ, మేడ్చల్: కరోనా కష్టకాలంలో, అసలే జీతాలు లేక సతమతం అవుతున్నామని, ప్రభుత్వం ఫీజు చెలించొద్దని చెబుతున్నా తమ పిల్లల ఫీజుల కోసం పాఠశాల యాజమాన్యం పదేపదే ఫోన్‌లు చేస్తూ ఇబ్బందులు పెట్టడం సరికాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఫీజులు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాస్‌ల లింక్‌లను కట్ చేస్తామని బెదిరింపులకు పలు పడటం సరైన పద్దతి కాదని బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాల మెయిన్ గేట్ ఎదట మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా స్కూల్ ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో విషయం తెలుసుకున్న బోయినపల్లి పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు.
అనంతరం స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. యాజమాన్యంతో పేరెంట్స్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మాదిరిగానే ఫీజులు వసూలు చేయాలని, ప్రస్తుత సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పైన భారం పడకుండా ఫీజులు తగ్గించాలని, అదికూడా వాయిదాల పద్దతిలో చెల్లించేలాగా తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు వారు తెలిపారు. అనంతరం సానుకూలంగా స్పందించిన యాజమాన్యం త్వరలో ఫీజుల విషయమై నిర్ణయం తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.