‘బైక్ అడిగినందుకు రాడ్‌తో కొట్టి చంపారు’

by Sumithra |
murder
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో బైక్ కొనియాలంటూ వేధిస్తున్నాడని కన్న కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా అమడగురు మండలం మద్దెమ్మగుడిపల్లెలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బైక్‌పైన మోజుతో తల్లిదండ్రులను తరచూ అభ్యర్థించేవాడు. కొత్త బైక్ కొనివ్వాలని మద్యం తాగి వచ్చి గొడవ పడేవాడు. ఇక కొడుకు చేష్టలతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఓ రాడ్‌తో దాడి చేయగా.. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story