- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీజులు కట్టారు.. స్కూళ్లు మూతపడ్డాయి.. ఇప్పుడెలా..?
దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది మార్చిలో మూతపడిన విద్యాసంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విడతల వారీగా తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 తరగతి ఆపై క్లాసులను ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుంచి 6వ తరగతి పైక్లాసుల ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థలను తిరిగి బంద్ చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సుమారు 51 రోజులు (9, ఆపై తరగతులు) మాత్రమే భౌతిక తరగతులు కొనసాగాయి.
ఈ సమయంలోనే పాఠాలు బోధించడం కంటే ఫీజులు వసూలు చేయడంపైనే యాజమాన్యాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాల్సిందేనని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ వారిని ఆందోళనకు గురిచేశాయి. దీంతో సుమారు 70 శాతం విద్యార్థులకు తరగతులకు హాజరయ్యారు. పరీక్షలు నిర్వహిస్తున్నామని తప్పనిసరిగా ఫీజు చెల్లించాలని పేరెంట్స్ పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ట్యూషన్ ఫీజుల పేరుతో పేరెంట్స్ నుంచి రెట్టింపు ఫీజు వసూలు చేశాయి. ఇలా 80 శాతం ఫీజులను యాజమాన్యాలు తీసుకున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం విద్యాసంస్థలు మూసివేయాలని ప్రకటించడంతో తాము కట్టిన ఫీజు తమకు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల వసూలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థలు కుమ్మకై పాఠశాలలు తెరిచారని స్కూల్ పేరెంట్స్ అసోషియేషన్ ఆరోపిస్తున్నది.
ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థలు కుమ్మక్కు
ఫీజులు వసూలు చేసేందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దిపొందుకే పాఠశాలలు ప్రారంభించారు. ప్లాన్ ప్రకారమే ఫీజుల పేరుతో రూ.కోట్లు వసూలు చేశారు. పరీక్షల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేసి ఫీజులు వసూలు చేశారు. ఫీజుల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలి. కట్టిన ఫీజును తిరిగి పేరెంట్స్‌కి అప్పగించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతాం. – వెంకట్, పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుడు
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ప్రైవేటు విద్యాసంస్థల్లో వసూలు చేసిన ఫీజులపై ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా చర్యలు చేపడుతాం. జీవో నెంబర్ 46 ప్రకారం కాకుండా ఫీజులు వసూలు పీజుల వసూలు విషయంలో యాజమాన్యాలు చట్టవిరుద్దంగా వ్యవహరించాయి. ట్యూషన్ ఫీజు పేరుతో రెట్టింటు ఫీజు వసూలు చేశాయి. అధిక ఫీజులు చెల్లించి నష్టపోయిన తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే బాలాల హక్కుల పరిరక్షణ కమిషన్ తరుపున తగిన చర్యలు చేపడుతాం. – పోనుగోటి అంజన్ రావు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు