వాలెంటైన్ డే నాడు పేరెంట్స్ డే

by Shamantha N |
వాలెంటైన్ డే నాడు పేరెంట్స్ డే
X

ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఫిబ్రవరి 14 నాడు గుజరాత్‌లోని సూరత్ పాఠశాలల్లో తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాధికారి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 14న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను పాఠశాలలకు తీసుకొచ్చి, పూజలు చేయాలనీ, అనంతరం మిఠాయిలు పంచిపెట్టాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సదరు అధికారి తెలిపారు. కాగా, నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి వివాదాలకు దారితీస్తుందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed