- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రచారంలో పాపిరెడ్డి.. ఝలకిచ్చిన కాంగ్రెస్
దిశ ప్రతినిధి, వరంగల్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పాల్గొనడం వివాదాస్పదమవుతోంది. ఈనెల 14న హన్మకొండలోని హరిత హోటల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రాడ్యుయేట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఇందులో పాపిరెడ్డి పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పినట్టు సమాచారం. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన పదవిలో కొనసాగుతూ టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి అతడిని పదవిలో నుంచి తొలగించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. టీజేఎస్ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం పలుచోట్ల మంగళవారం నిర్వహించిన ప్రచారంలో పాపిరెడ్డి తీరును ఎండగట్టారు.
చర్యలు తీసుకోవాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పాల్గొనడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన పదవిలో కొనసాగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అభ్యర్థి తరుపున ఓట్లను కోరడం వంటి అంశాలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడం కిందకే వస్తాయి. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశాం. – కె.విజయ్‌కుమార్, కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి