కొత్త వైరస్ భయపెడుతోంది.. బీ కేర్‌ ఫుల్

by Shyam |   ( Updated:2021-01-08 21:36:11.0  )
కొత్త వైరస్ భయపెడుతోంది.. బీ కేర్‌ ఫుల్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కొత్త రకం కరోనా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. రూపాంతరం చెందిన వైరస్ ​స్ట్రెయిన్​ పేరిట తరుముకొస్తోంది. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొత్త టెన్షన్​ మొదలైంది.

ముందస్తు జాగ్రత్తలతో స్ట్రెయిన్ ను కట్టడి చేయవచ్చునని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు పేర్కొంటున్నారు. స్ట్రెయిన్ పై నెలకొన్న అనుమానాలు, అపోహలపై ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కరోనా వైరస్ రూపాంతరాల్లో కొత్త స్ట్రెయిన్ ఒకటి. దీన్ని వీయూఐ 202012/01 అని పిలుస్తారు. ఇది కొత్త వైరస్ మాత్రం కాదు. వైరస్ జన్యు మార్పిడుల్లో భా గంగా ఈ కొత్త రకం ఆవిర్భవించినట్లు స్పష్టమవుతోంది. ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉం టుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ వైరస్ తో పోలిస్తే ఇది 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

ఆందోళన వద్దు..

కొత్తరకం స్ట్రెయిన్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో నివారించేందుకు అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మాస్కులు తప్పనిసరి..

కరోనా, కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తిని నిరోధించాలంటే ఏకైక మార్గం మాస్క్ ధరించడ మే. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉం డాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సం క్రాంతి పం డుగ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఏ మాత్రం అలస త్వం వహించినా మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు వ్యాక్సి న్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. వ్యాక్సిన్ తీసు కున్నా యాంటీబాడీస్ అభివృద్ధి చెందేందుకు కనీసం 45 రోజులు పడుతోంది. మరో మూడు నుంచి నాలుగు నెలలు వైరస్ నుంచి మనకు రక్షణ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కొత్త స్ట్రెయిన్ లక్షణాలు..
ప్రపంచవ్యాప్తంగా 15రోజుల్లో 50 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సగం కేసులు కొత్తరకం స్ట్రెయిన్​గా నిపు ణులు చెబుతున్నారు. ఈ గణాంకా లు ఆందోళన కలిగిస్తున్నాయి. స్ట్రెయిన్ తో ప్రస్తుతం ఇబ్బంది లేనప్పటికీ, రానున్న రోజుల్లో కేసులు నమోదయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కొత్త రకం స్ట్రెయిన్ కు సంబంధించి లక్షణాల్లో ఆకలి వేయకపోవడం, విపరీతమైన తలనొప్పి, గందరగోళం, విరేచనాలు, కండరాలు నొప్పులు ఉంటాయి. జాగ్రత్తే ముందస్తు మందుగా గుర్తించారు.

జాగ్రత్తలు తీసుకోవాలి..

ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి. శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించాలి. వాతావరణం కూల్ గా ఉండడంతో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జిల్లా లో ఓ మహిళకు కొత్త రకం కరోనా వచ్చింది. జిల్లా వైద్య యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుని ఆమె కోలుకునేలా వైద్యం అందించింది. మిగితా వారికి రాకుండా కట్టడి చేయగలిగాం. టెన్షన్ లేకున్నా అప్రమత్తంగా ఉండాలి.
-డాక్టర్ కె.మల్లికార్జునరావు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి

Advertisement

Next Story

Most Viewed