- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో క్రికెట్‌పై కరోనా ప్రతాపం: ద్రవిడ్
దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వైరస్ కారణంగా రోజూ వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కరోనా, క్రికెట్‌పై ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆటగాళ్లు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. కానీ అక్టోబర్‌లో దేశవాళీ సీజన్ ప్రారంభమైన తర్వాత మాత్రం పరిస్థితి మన చేతిలో ఉండదని, చాలా దారుణంగా ఉంటుందని ద్రవిడ్ హెచ్చరించాడు. ‘కొవిడ్-19 కారణంగా ఎన్నో క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. క్రికెట్‌లో పలు అంతర్జాతీయ టోర్నీలు రద్దవ్వగా మరికొన్ని వాయిదా వేశారు. అయితే, అక్టోబర్ నెలలో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొనక పోతే మాత్రం క్రీడలకే కాకుండా అందరికీ చాలా ప్రమాదం. పరిస్థితి మన చేయిదాటి పోయే అవకాశం చాలా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్, యువ క్రికెటర్లను మలిచే పనిలో ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో క్రికెటర్లు ఇళ్లకే పరిమితం అవడం వల్ల వైరస్ బారినుంచి తప్పించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.