‘దిశ’ ఎఫెక్ట్ : సెక్యూరిటీ గార్డు ‘సర్పంచ్‌’కు నిధులివ్వాలని ఆదేశాలు

by Shyam |   ( Updated:2021-08-20 08:51:16.0  )
‘దిశ’ ఎఫెక్ట్ : సెక్యూరిటీ గార్డు ‘సర్పంచ్‌’కు నిధులివ్వాలని ఆదేశాలు
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ‘ఉదయం సర్పంచ్ రాత్రికి సెక్యూరిటీ గార్డు’ సోమవారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారిణి స్పందించారు. రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి సంబంధించిన నిధుల వివరాలను శుక్రవారం సాయం కాలం సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు. దాని ప్రకారం… 2020-21 సంవత్సరంలో ఆరెపల్లి గ్రామానికి 7,93631 నిధులు సర్దుబాటు చేయబడ్డాయని పేర్కొన్నారు. ఇందులో రూ. 6,77,737 నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేశారని ఆమె తెలిపారు. ఇంకా 1,15,897 నిధులు గ్రామ పంచాయతీలో నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అదే విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామానికి 4,43,920 లక్షల రూపాయలు మంజూరు కాగా.. రూ. 3,31,778 నిధులు ఖర్చు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రూ.1,12,142 నిధులు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం ప్రతీ నెలా గ్రామానికి 37,748 రూపాయలు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయబడుతున్నాయని తెలిపారు.

panchayathi officer orders

ఇటీవల మిషన్ భగీరథ ట్యాంకుల అపెక్స్ పెయింటింగ్ 20 వేల రూపాయలు, గ్రామంలో దోమల నివారణకు 8 వేల రూపాయలు వెచ్చించి దోమల మందును పిచికారి చేసినట్టు వాటికి, సంబంధించిన నిధుల ఎంబీ రికార్డు కానందున నిధులు మంజూరు కాలేదన్నారు. గ్రామ సర్పంచ్ వ్యక్తిగతంగా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గత నెలలో అతని తల్లి, భార్య శస్త్ర చికిత్స కొరకు లక్షా యాభై వేల రూపాయలు, సర్పంచ్ సొంత డబ్బులను నుండి చెల్లింపులు జరిగాయని.. అదేవిధంగా సర్పంచ్ సోదరి మరణించడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ భారమై సర్పంచ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గతంలో గ్రామ పంచాయతీకి రూ.2,45000 మంజూరు చేయగా.. ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు నిమిత్తం జిల్లా కలెక్టర్ నిధుల సాయం చేశారని పంచాయతీ అధికారిణి తెలిపారు. గ్రామాభివృద్ధి కొరకు సర్పంచ్ వ్యక్తిగత నిధుల నుండి ఖర్చు చేస్తే వెంటనే సంబంధిత బిల్లులను ఎంబీ రికార్డు చేయించి ట్రెజరీ అధికారులు కు అందించాలని ఆమె ఆదేశించారు. దీనికి జిల్లా కలెక్టర్ సుముఖంగా ఉన్నట్లు డీపీవో తెలిపారు.

పేరుకే పదవులు.. పొద్దున సర్పంచ్.. రాత్రైతే సెక్యూరిటీ గార్డు!

Advertisement

Next Story

Most Viewed