నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్

by Shyam |
నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్
X

దిశ,వెబ్‌డెస్క్: జనగామ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కె.నిఖిల ఉత్తర్వులు జారీచేశారు. హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం చూపినందుకు గాను వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారిలో చిల్పూరు మండలం వంగాలపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మీ, కృష్టాజిగూడెం పంచాయతీ కార్యదర్శి విమల, రఘునాధపల్లి మండలం ఖిలేశాపూర్ పంచాయతీ కార్యదర్శి నజీర్, దేవరుప్పుల మండలం ధర్మగడ్డితాండ పంచాయతీ కార్యదర్శి సోమేశ్‌లు ఉన్నారు.

Advertisement

Next Story