పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

by Shyam |

దిశ, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్య పేట పంచాయతీ కార్యదర్శి నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గయ్యపేట గ్రామానికి చెందిన నర్సరీ నిధుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపించిన కలెక్టర్ ఆరోపణలు రుజువు కావడంతో పంచాయతీ సెక్రటరీ నాగమణి ని సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story