పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

by Shyam |

దిశ, మహబూబ్‎నగర్: గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల వేధింపులు తాళలేక ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే.. మహబూబ్‎నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల్లిలో అరుణ్ కుమార్(24) పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, అరుణ్ కుమార్ జిల్లా కేంద్రంలోని మర్లులో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం వుంటున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అరుణ్ తన రూములోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా ఎంతకీ అరుణ్ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూడగా శవమై కనిపించాడు. దీంతో వారు మహబూబ్‎నగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అరుణ్ బ్యాగులో ఓ సూసైడ్ నోట్ లభ్యమైందని.. సర్పంచ్, వార్డు సభ్యుల వేధింపులు తాళలేకనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

tag: Panchayat secretary, commits suicide, mahabubnagar

Advertisement

Next Story