- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంచాయత్ రివ్యూ: సెక్రటరీ ఉద్యోగం అంత దారుణమా?
దిశ, వెబ్‌డెస్క్: ‘సెక్రటరీ ఉద్యోగం చేసే వారికి ఆత్మాభిమానం ఉండదు’ ఈ ఒక్క డైలాగ్ చాలు, ఆ ఉద్యోగం చేసే వారి మానసిక వేదనకు దర్పణం పట్టడానికి. సెక్రటరీ ఉద్యోగం మరీ అంత దారుణంగా ఉంటుందా? ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘పంచాయత్’ చూస్తే అర్థమవుతుంది. పైకి కనిపించే అంత సులభంగా ఉండదు ఆ ఉద్యోగం. ముఖ్యంగా పైచదువుల మీద ఆశ ఉండి, ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ… పరిస్థితుల కారణంగా సెక్రటరీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చిన వారి మానసిక వేదన అంతా ఇంతా కాదు. పైకి చెప్పుకోలేరు. అర్థం చేసుకునేవాళ్లు ఉండరు. ఏం చేయాలో తేలిక అలా ఇంటి పైకప్పును చూస్తూ కాలాన్ని గడిపేయడమే.
కథ విషయానికి వస్తే… అభిషేక్ త్రిపాఠి ఇంజినీరింగ్ చదువుతాడు. కానీ ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరకకపోవడంతో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వస్తే అందులో చేరతాడు. చేరేటపుడే అయిష్టంగా చేరతాడు. చేరక తప్పని పరిస్థితి. అప్పటివరకు గ్రామాలు ఎలా ఉంటాయో తెలియని అభిషేక్, ఓ మారుమూల గ్రామంలో బతకాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ గ్రామంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తే తప్పుగా అనుకుంటారు. మొహమాటానికి పోయి అభిషేక్ చాలా ఇబ్బందులకు పడతారు. అసలే ఇష్టంలేని ఉద్యోగం, పైగా అలవాటు లేని పనులు… దీంతో ఈ ఉద్యోగాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అందుకు ఒకటే దారి… క్యాట్ ఎగ్జామ్ రాసి, టాప్ ఐఐఎంలో సీటు సంపాదించడం. పుస్తకాలు తెప్పించుకుంటాడు. ఓవైపు గుర్తింపు లేని పనులు, మరోవైపు క్యాట్ పరీక్ష… చదవడానికి చాలా కష్టపడతాడు. మరి ఆ ఉద్యోగం వదిలించుకున్నాడా? లేదా? అనేది సిరీస్‌లో చూడాలి.
నిజమైన సమస్యలు నిక్కచ్చిగా…
గ్రామాల్లో పనిచేసే ఓ కిందిస్థాయి ఉద్యోగి పడే మానసిక ఇబ్బందులు చాలా చక్కగా చూపించారు. పైకి చూడటానికి సమస్యలు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ ఆ సమస్య తీర్చడానికి ఆ పంచాయతీ సెక్రటరీ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తాడో చూపిస్తారు. ఒకానొక సమయంలో గణతంత్ర దినోత్సవానికి ప్లెక్సీలు కట్టడం కూడా ఒక పనేనా? అంటూ అభిషేక్ తనని తాను కించపరుచుకునే సీన్ ఆ ఉద్యోగంలో ఉన్న లోతైన ఇబ్బందిని తెలియజేస్తుంది. ఓ వైపు తన తోటి స్నేహితులు శుక్రవారం రోజున వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే…తాను ఈ ఊర్లో ఒంటరిగా బీర్ తాగాల్సి వస్తుంది. మొహమాటానికి పోయి తాను చేసిన పనులు, తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు సంబంధం లేని వారితో మాటలు పడటం, వీటన్నిటి కారణంగా అభిషేక్ అనుభవించే మానసిక క్షోభ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
అభిషేక్ పరిస్థితి చూస్తుంటే గతేడాది ఇదే సమయానికి తెలంగాణలో ఉద్యోగాల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జీవితం గుర్తొస్తుంటుంది. వాళ్లు కూడా ఈ ఉద్యోగం కోసం మంచి ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నారు, తల్లిదండ్రుల మాట కోసం ఉద్యోగాల్లో చేరి నరకం అనుభవించారు. ఓ వైపు అందరూ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉంటే పంచాయతీ సెక్రటరీ మాత్రం కనీసం నోటికి మాస్కు కూడా కట్టుకోకుండా పనిచేస్తున్నాడు. కానీ అతని పనిని ఎవరూ గుర్తించరు. కానీ ఏం చేస్తాం? అచ్చం అతని పరిస్థితి కూడా అభిషేక్ లాంటిదే. అయితే ఈ సిరీస్‌లో కేవలం గ్రామంలో పంచాయతీ సెక్రటరీకి తలెత్తే సమస్యలు మాత్రమే చూపించారు. కానీ పైఅధికారుల ఒత్తిడి కారణంగా కలిగే సమస్యలు కొన్నిసార్లు ఎందుకురా ఈ బతుకు అని అనుకునే పరిస్థితిని కల్పిస్తాయి. సీజన్ 2లో ఈ సమస్యలను చూపిస్తే బాగుంటుందని ఆశిద్దాం!
Tags: Panchayat, Secretary, Village life, Amazon prime, JPS