- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం.. అధికారులను అడ్డుకున్న అక్రమార్కులు
దిశ, మేడ్చల్: మేడ్చల్ మండలంలో పంచాయతీ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మండలంలోని ఎల్లంపేట్, రాజా బొల్లారం గ్రామంలో ఎం పి ఓ వినూత్న రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యదర్శులు ప్రణీత, ఎలిజబెత్ కలిసి అక్రమ కట్టడాలు కూల్చివేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టినా ముందస్తు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మండలంలోని ఎల్లంపేట్ గ్రామంలో గ్రామ కంఠం స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని కూల్చివేయడానికి వెళ్లిన అధికారులను అక్రమార్కులు అడ్డుకున్నారు. వారిని వెళ్లకుండా వాహనాన్ని ఆపి, ఇష్టానుసారంగా మాట్లాడారని పంచాయతీ కార్యదర్శి ప్రణీత ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిని అడ్డుకోవడం సరైనది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనలతో పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక పై తన విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.