ఆ రాశివారికి చాలా అనుకూలమైన రోజు

by Hamsa |
Panchangam Rasi phalalu
X

శుభమస్తు

తేదీ: 24, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(నిన్న ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 8 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 29 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 0 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 29 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 52 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మకరము
విశేషం
24. గురుపౌర్ణమి

మేష రాశి. అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మస్థైర్యం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది పాత బాకీలు తీర్చి వేస్తారు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. కొంతమందికి ఇల్లు మార్పు. ప్రయాణాలను వాయిదా వేయండి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. అత్యవసరం లో స్నేహితుల సహాయం లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి. అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం వ్యాపారులకు కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లాభాలు. భాగస్వామ్య వ్యాపారం లో భాగస్వాముల మధ్య ఒకరి సహకారం ఒకరికి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అవుతారు. మీ తల్లి గారి వైపు నుంచి తన సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులలో అధిక శ్రమ. అధిక సామర్థ్యంతో పని చేసినప్పటికీ పనులు మిగిలిపోయే అవకాశం. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చు ల వలన డబ్బుకు ఇబ్బంది. సీజన్ మార్పుల వలన కంటి జబ్బులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడకండి. ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి

మిధున రాశి. మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి. సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను వీలైతే వాయిదా వేయండి. అనుకోని ధనలాభం దానివలన ఆర్థిక సమస్యలు చక్కబడతాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారు చెప్పేది వినండి. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. కొందరు ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. బయట భోజనం మానండి ఆరోగ్యంగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు

సింహరాశి. మీ మీద మీరు పూర్తి నమ్మకం పెంచుకోండి. అదనపు బాధ్యతలను తీసుకోవలసి వస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి మరింత సంపాదన కొరకు ఇతరుల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ సీజన్ మార్పుల వల్ల దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి. ఈ రోజు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పై అధికారుల ఒత్తిడి వలన టెన్షన్. సహనంతో వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారులకు లాభాలు. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి దాన ధర్మాల వలన మానసిక ప్రశాంతత. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. నోటిని అదుపులో ఉంచుకోండి లేకుంటే ఇబ్బందులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు గొడవలు పెంచుకోకండి దానివలన బంధాలు తెగిపోయే అవకాశం.

కన్యారాశి. అనుకున్న కార్యాలను సాధించడానికి మరింత కష్టపడాలి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని మానసిక అశాంతి. ఆఫీసు పనులలో ఆలస్యం. తోటి ఉద్యోగుల సహాయం లేకపోవడం వలన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ప్రముఖ వ్యక్తుల సహకారం వలన మానసిక ధైర్యం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి. మీ భార్య భర్తలు ఇద్దరూ ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోవటానికి ప్రయత్నించండి. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి వారి సమయం వృధా చేస్తున్నారు. ప్రయాణాలలో ఇబ్బందులు. ఆదాయం పరవాలేదు. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. కొత్తగా వ్యాపారం చేద్దామనుకుంటున్న వారు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం.

వృశ్చిక రాశి. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. నూతన పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. అన్ని పథకాలు లాభాలను తేలేవు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. మనసును అదుపులో పెట్టుకోండి అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టడం వలన సమయం వృధా. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. షాపింగ్ చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను చేద్దామనుకుని తీరికలేకుండా పెండింగ్ పెడుతున్నారు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి. సహనము ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. సొంత ఇంటి కల నెరవేరనుంది. ఆఫీస్ పనులలో అధిక శ్రమ. తోటి ఉద్యోగుల సహాయం లభించక పోవడం వలన పనుల పెండింగ్. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. ముఖ్య అవసరాలకు ఖర్చు పెట్టండి. అధిక శ్రమ వలన మరియు సరైన నిద్ర లేకపోవడం వలన ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

మకర రాశి. ఆత్మస్థైర్యం సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నెగెటివ్ ఆలోచనలను వదిలివేయండి. ఆదాయం పరవాలేదు. అనవసరపు ఖర్చుల వలన డబ్బుకి ఇబ్బంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు. దేవాలయాలను సందర్శిస్తారు దైవ ప్రార్థనల వలన మానసిక బలం. కుటుంబ సభ్యుల అవసరాలను గమనించండి వారితో కొంత సమయం గడపండి. ముఖ్యంగా మీ తల్లి గారితో మాట్లాడండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణల వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడుపుతారు.

కుంభరాశి. సోమరితనం వదిలిపెట్టండి. గందరగోళం వల్ల సరైన ఆలోచనలు రావు. పై అధికారులు గమనిస్తున్నారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. అభిప్రాయ భేదాల వలన వ్యాపారం దెబ్బతినే అవకాశం. అజాగ్రత్తగా ఉండకండి వస్తువులు డబ్బు జాగ్రత్త. సీజన్ మార్పుల వలన కంటి జబ్బులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి చిన్నచిన్న గొడవలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు నడపండి.

మీన రాశి. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేకుంటే ఇబ్బందులు. ముఖ్యంగా ఆఫీసులో సహనంతో వ్యవహరించండి. సీనియర్లతో వాదోపవాదాలకు దిగకండి. వారి సహాయం తీసుకోండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్టు ఇవ్వబోతున్నారు ఆనందించండి

Advertisement

Next Story

Most Viewed