- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీఎల్ఐ పథకం కింద రూ. 300 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన పానసోనిక్ ఇండియా
దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో కరోనా పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో పండుగ సీజన్‌లో గిరాకీ మెరుగ్గా ఉందని ప్రముఖ గృహోపకరణాల సంస్థ పానసోనిక్ ఇండియా వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ ధోరణి ఇలాగే కొనసాగవచ్చని కంపెనీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే దేశీయ ఉత్పత్తి అనుసంధాన పథకం(పీఎల్ఐ) కింద కంప్రెషర్లు, హీట్ ఎక్స్ఛేంజర్లను తయారు చేసేందుకు తాము రూ. 300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 18 శాతం వృద్ధిని సాధించాం. పండుగ సీజన్ పూర్తయ్యే వరకు దీన్ని కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ వృద్ధి రానున్న రోజుల్లో పరిశ్రమ అమ్మకాలను మరింత పెంచ్తుందని ఆశిస్తున్నట్టు పానసోనిక్ ఇండియా ఛైర్మన్, సీఈఓ మనీష్ శర్మ అన్నారు. వినియోగదారుల కొనుగోలులో అనేక మార్పులను గమనిస్తున్నాం. ధరలతో పాటు ఉత్పత్తుల నాణ్యత, విలువకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు 43 కొత్త రీఫ్రిజిరేటర్లు, 24 కొత్త వాషింగ్ మెషీన్లను విడుదల చేశామని మనీష్ శర్మ తెలిపారు. గత ఏడాదిన్నరగా ఆన్‌లైన్ కొనుగోళ్లలో కనిపిస్తున్నప్పటికీ, ఆఫ్‌లైన్ అమ్మకాలే పరిశ్రమకు కీలకంగా ఉందని మనీష్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను అనుసరించే రానున్న రోజుల్లో కంప్రెషర్లు, హీట్ ఎక్స్ఛేంజర్ల తయారీకి రూ. 300 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు.