- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా మహిళా సంఘాల సభ్యులు గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. కేవలం పది రోజులలో రెండు కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ ను తయారుచేసి గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ అంశంపై గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు బృందం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని వివరాలను పరిశీలించి నివేదికను గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ ప్రతినిధులకు తెలియజేశారు. దీనికోసం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు 73,918 బంతులతో రెండు కోట్ల విత్తన బంతుల అతిపెద్ద సెంటెన్స్ ను రూపొందించి వాళ్లు రికార్డును సాధించారు.
ఈ మేరకు గిన్నిస్ బుక్ ఇక్కడ ప్రతినిధి రిషి నాథ్ పాలమూరు జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ తో తయారు చేసిన అతి పెద్ద సెంటెన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గా నిలిచాయని ప్రకటించారు. రికార్డు సాధించడానికి అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు, జిల్లా అధికార యంత్రాంగానికి, మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం
తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో విరాజిల్లాలని ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛాలెంజ్ కు ఈ గిన్నిస్ బుక్ రికార్డును అంకితం చేస్తున్నట్లుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రికార్డు సాధించడానికి కారకులైన మహిళా సంఘాల సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు.