- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరు యూనివర్సిటీని పచ్చదనంతో సింగారించాలి…
దిశ, పాలమూరు: పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలని CM OSD ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం ఆమె పాలమూరు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ మొత్తాన్ని తిరిగి హరితహారం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్‌ను అడిగి తెలుసుకున్నారు. హరిత హారం కింద ఇంకా యూనివర్సిటీ లో మొక్కలు నాటేందుకు పలు సూచనలను చేశారు.
జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు ముఖ్యమంత్రి ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డి ఎఫ్ ఓ గంగిరెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పిండి పవన్ కుమార్, వీసీ ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ నూర్జహాన్, జడ్చర్ల డిగ్రీ కళాశాల అధ్యాపకులు సదాశివయ్య, ఆయా విభాగాల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.