దావూద్‌తో పాక్ నటి ప్రేమాయణం?

by Anukaran |   ( Updated:2020-08-25 03:56:42.0  )
దావూద్‌తో పాక్ నటి ప్రేమాయణం?
X

పాకిస్థాన్ ప్రముఖ నటి మెహ్విష్ హయత్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలున్నాయా? ఐటెం గర్ల్‌గా కెరియర్ మొదలు పెట్టిన మెహ్విష్.. బిగ్ ప్రాజెక్ట్స్ చేయడానికి కారణం కూడా అతనేనా? అత్యంత గౌరవప్రదమైన పాక్ పౌర పురస్కారం ‘తమ్గా ఇంతియాజ్’ అవార్డు మెహ్విష్‌కు దక్కడంలో దావూద్ పాత్ర ఉందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఇండియాలో ఉన్నప్పుడు కూడా బాలీవుడ్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పలు సినిమాల నిర్మాణంలోనూ తన పాత్ర ఉండగా.. తన ఇంట్లో జరిగే పార్టీలకు బాలీవుడ్ నటీనటులు కూడా వెళ్ళేవారు. ఆ తర్వాత భారత్ నుంచి పాక్ పారిపోయిన దావూద్.. అక్కడ కూడా సినీ ఇండస్ట్రీని గ్రిప్‌లో పెట్టుకున్నట్టు టాక్. ఈ క్రమంలోనే మెహ్విష్‌తో ప్రేమాయణం నడిపడంతో.. ఆమె తన బలహీనతగా మారిపోయిందని సమాచారం. కాగా, దావూద్ ఫిల్మ్ మేకర్స్‌పై ఒత్తిడి చేయడం వల్లే ఐటెం గర్ల్‌గా ఉన్న మెహ్విష్.. మంచి ప్రాజెక్ట్స్ సంపాదించి స్టార్ రేంజ్‌కు ఎదిగిందని తెలుస్తోంది.

దావూద్‌తో‌ కొనసాగిన ప్రేమాయణం వల్లే అసలు ఎలాంటి అర్హత లేని మెహ్విష్‌కు ప్రతిష్టాత్మక అవార్డు ‘తమ్గా ఇంతియాజ్’ లభించించగా, ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. కాగా, ఇప్పటికీ పాక్ సినీ ఇండస్ట్రీ దావూద్ చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed